అక్కడ వీరమల్లు విడుదలపై ఉత్కంఠ.. రిలీజ్ ముందువరకు ప్రింట్స్ అందలే: లైన్‌ క్లియర్‌ అంటూ పోస్ట్

అక్కడ వీరమల్లు విడుదలపై ఉత్కంఠ.. రిలీజ్ ముందువరకు ప్రింట్స్ అందలే: లైన్‌ క్లియర్‌ అంటూ పోస్ట్

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా అంతటా వీరమల్లు ఫీవర్ పట్టుకుంది. ఇంకా ఈ సినిమా రిలీజ్కు మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈ క్రమంలో పవర్ స్టార్ ఫ్యాన్స్లో హంగామా మొదలైంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఒవర్సీస్లో టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే, ఓవర్సీస్‌లో వీరమల్లు రిలీజ్ విషయంలో నిన్నటివరకు (జూలై22) కాస్తా అవకతవకలు నెలకొన్నాయి. ఇప్పటికీ ఇంకొన్ని చోట్ల ఉన్నాయి. 

ఎందుకంటే, హరి హర వీర మల్లు సినిమాను బుధవారం నాటికి (జూలై23) సెన్సార్ బోర్డుకు పంపాల్సి ఉంది. కానీ అది జరగలేదు. అందుకు ముఖ్య కారణం.. ఓవర్సీస్ ప్రింట్లలో ఆలస్యం జరిగిందని సమాచారం. ఈ విషయంపై డిజిటల్‌ ప్రింట్‌ అందలేదని విదేశీ నిర్మాణసంస్థ (ప్రత్యంగిర సినిమాస్) పోస్ట్‌ పెట్టింది. 

ALSO READ : అవతార్‌‌‌‌ 3 ట్రైలర్ అప్‌‌డేట్.. జులై 25న ట్రైలర్‌‌‌‌.. డిసెంబర్ 19న సినిమా రిలీజ్

ఇక ఓవర్సీస్లో రిలీజ్ కాదేమో అనుకున్న ఈ క్రమంలోనే.. ఫ్యాన్స్కు విదేశీ నిర్మాణసంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా (జూలై23న) వీరమల్లు విడుదల విషయంలో లైన్‌క్లియర్‌ అయిందని తెలుపుతూ సదరు సంస్థ పోస్ట్‌ పెట్టింది.

“హరిహర వీరమల్లు కంటెంట్ USA అంతటా చాలా థియేటర్లకు చేరుకుంది. మిగిలిన ప్రదేశాలకు రేపు మధ్యాహ్నం నాటికి అది అందుతుంది. అందుకు అవిశ్రాంత మద్దతు ఇచ్చినందుకు క్యూబ్ సినిమా బృందానికి అభినందనలు. మా బృందంతో పాటు కీలక నగరాల్లో కంటెంట్ డెలివరీని నిర్ధారించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని తెలిపింది.

అలాగే ఈ మూవీ ఫస్ట్‌హాఫ్‌ 1గంట 26 నిమిషాల 40 సెకన్లు అని, సెకండ్‌హాఫ్‌ 1గంట 18 నిమిషాల 25 సెకన్లు అని ట్వీట్ ద్వారా ప్రత్యంగిర సినిమాస్ వెల్లడించింది. ఈ విషయాన్ని పరిష్కరించడానికి చిత్రనిర్మాతలు తమ శాయశక్తులా ప్రయత్నించారు. మరియు వీలైనంత త్వరగా క్లియరెన్స్ పూర్తి చేయడానికి కృషి చేశారు. ఇకపోతే, నేడు USAలో ప్రీమియర్స్ మొదలవ్వనున్నాయి. అయితే, VFX, సౌండ్ మిక్సింగ్ వంటి క్వాలిటీ విషయంలో ఈ ఆలస్యం జరిగినట్లు సమాచారం.  

హరి హర వీరమల్లు సెన్సార్:

‘హరి హర వీరమల్లు- స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’మూవీకి U/A సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. ఈ సినిమా 2 గంటల 42 నిమిషాల భారీ నిడివితో రానుంది. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు.