
ఈమధ్యనే ‘భీమ్లానాయక్’గా తిరుగులేని హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ చాలావరకు పూర్తయ్యింది. త్వరలోనే బ్యాలెన్స్ షూట్‌ను స్టార్ట్ చేయబోతున్నట్లు నిన్న రివీల్ చేశారు. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి పర్యవేక్షణలో భారీ సెట్స్ వేస్తున్నారు. ఏప్రిల్ 6 నుంచి షెడ్యూల్ మొదలు కానుంది. భారీ యాక్షన్ సీన్స్ తీయబోతున్నారు. బాలీవుడ్ స్టంట్ మాస్టర్, హీరో విక్కీ కౌశల్ తండ్రి శామ్ కౌశల్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. పవన్ నటిస్తున్న ఫస్ట్ పీరియాడికల్ మూవీ ఇది. నిధి అగర్వాల్ హీరోయిన్. నర్గీస్ ఫక్రి మరో హీరోయిన్. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రామ్‌పాల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి దసరాకి సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట నిర్మాత ఎ.ఎం.రత్నం. నిజానికి ఏప్రిల్ 29న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ థర్డ్ వేవ్ వల్ల కొంత, పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల మరికొంత ఆలస్యమైంది. దీని తర్వాత హరీష్ శంకర్‌తో ‘భవదీయుడు భగత్‌సింగ్’తో పాటు సురేందర్ రెడ్డి సినిమాలోనూ నటించనున్నారు పవన్.