జగిత్యాల జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రైవేటు రిసార్ట్ నుంచి బయటికి వచ్చేటపుడు కారు పైకి ఎక్కి అభిమానులు, కార్యకర్తలకి పవన్అభివాదం చేస్తుండగా విద్యుత్ సర్వీస్ వైర్లు అడ్డు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పవన్ ను తప్పించారు. వెంటనే కారుపైన ఉన్నపవన్ పడుకుని అభివాదం చేశారు. దీంతో పవన్ కు తృటిలో ప్రమాదం తప్పింది.
జనవరి 3న ఉదయం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొండగట్టు అంజన్న అంటే తనకు సెంటిమెంట్ అని, అంజన్న ఆశీస్సులతోనే ప్రమాదం నుంచి బయటపడ్డానని అన్నారు పవన్ కళ్యాణ్. కొండగట్టు అభివృద్ధికి తన వంతు సాయం ఉంటుందని.. ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ కూడా సహకరిస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్.
గతంలో అంజన్న దర్శనానికి వచ్చినప్పుడు వసతి గృహాలకు సహాయం చేయాలని తనను అడిగారని.. టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యుల సహకారంతో అవసరమైన నిధులు ఇప్పించానని అన్నారు పవన్. అంజన్న ఆశీస్సులతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు.
