
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ 'హరి హర వీరమల్లు'. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరించారు. గురువారం (జులై 24న) హరి హర వీరమల్లు గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం (జులై21న) ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ ప్రెస్ మీట్లో హీరో పవన్ కళ్యాణ్ సైతం పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ' నా జీవితంలో మీడియాతో జరుగుతున్న ఫస్ట్ ఇంటరాక్షన్ ఇది. సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలియదు. అది నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ నిర్మాత ఏఎం రత్నం కోసం పెట్టాల్సి వచ్చింది. ఒక చిన్నపాటి సౌకర్యం కోసం ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది. అలాంటిది ఇంత పెద్ద సినిమాను నిర్మించిన నిర్మాత కోసం ఈ మాత్రం అయినా చేయడానికి వచ్చిన.
ఈ వీరమల్లు సినిమా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని.. ఇపుడు ప్రేక్షకుల ముందుకొస్తుంది. నిర్మాత రత్నం గారి తపన చూసి..ఎంత బెస్ట్ ఇవ్వగలనో అంతా బెస్ట్ ఇచ్చాను. నేను అన్నిటికంటే ముఖ్యంగా టైం ఇవ్వలేను. పొలిటికల్ దృష్ట్యా కొద్దిగా ఆలస్యం జరిగింది. కానీ, క్లైమాక్స్ కోసం దాదాపు 57 రోజులు మండుటెండల్లో టైం ఇవ్వాల్సి వచ్చింది. ఈ ఫస్ట్ పార్ట్కి క్లైమాక్స్ ఆయువు పట్టులాంటిది. నిర్మాత కనుమరుగవుతున్న సమయంలో.. ఇబ్బందులు కలుగొద్దని చెప్పి సినిమాని భుజాల మీదికి తీసుకున్నానని' పవన్ అన్నారు.
ఇకపోతే.. ఈ మూవీ టికెట్ల రేటు పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ప్రీ-సేల్స్‌లో సినిమా తొందరగా దూసుకుపోతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరి పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను అందుకుని, బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాలి.