ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. సజ్జలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్..

ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. సజ్జలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్..

మెగాస్టార్ చిరంజీవి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వటం, టీడీపీ కూటమికి ఓటేయాలని పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. చిరంజీవి కూటమికి మద్దతివ్వడం పట్ల వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మా అన్న చిరంజీవికి జోలికి వస్తే ఊరుకునేది లేదని అన్నారు.

చిరంజీవి అజాత శత్రువని, ఆయన గతంలో మూడు రాజధానుల విషయంపై వైసీపీకి మద్దతుగా మాట్లాడితే తాను ఒక్క మాట కేసుల మాట్లాడలేదని, చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉంటారో, వేరే పార్టీలో ఉంటారో అది ఆయన ఇష్టమని అన్నారు. సజ్జల ప్రజల కట్టిన ట్యాక్స్ డబ్బులతో జీతం తీసుకుంటున్నదని అన్నారు. రాష్ట్ర ప్రజల జోలికి, చిరంజీవి జోలికి, బడుగు బలహీనవర్గాల జోలికి వస్తే ఊరుకునేది లేదని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.