OG Ticket Price: ‘ఓజీ’ బెనిఫిట్‌ షో టికెట్ రూ.1000లు.. అధిక ధరల పెంపుపై తీవ్ర విమర్శలు !!

OG Ticket Price: ‘ఓజీ’ బెనిఫిట్‌ షో టికెట్ రూ.1000లు.. అధిక ధరల పెంపుపై తీవ్ర విమర్శలు !!

పవర్ తుఫానుకి రంగం సిద్ధమైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఓజీ’తో సత్తా చాటే సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్ 25న పవన్ నటించిన అప్ కమింగ్ ‘ఓజీ’ వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఓజీ మూవీకి టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ బుధవారం (సెప్టెంబర్ 17న) ఉత్తర్వులు జారీ చేశారు.

 ‘ఓజీ’ టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే:

ఇప్పటికే ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్తో విదేశాల్లో అదరగొడుతోంది. అక్కడ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతూ రికార్డులు తిరగరాస్తోంది. ఈ క్రమంలో మన దగ్గర (ఏపీలో) టికెట్ రేట్లతో పవన్ ఫ్యాన్స్లో వావ్ అనిపిస్తుంది. మరికొందరు సగటు ఆడియన్స్కి షాక్ కలిగిస్తుంది. కారణం పెంచిన టికెట్ ధరలు. 

‘ఓజీ’ బెనిఫిట్‌ షో టికెట్‌ ధర ఏకంగా రూ.1,000లు (జీఎస్టీతో కలిపి) ఉంది. ఈ బెనిఫిట్‌ షో శుక్రవారం (సెప్టెంబర్ 25న) అర్ధరాత్రి 1 గంటకు పడనుంది. ఇపుడు ఈ టికెట్ ధరపై సదరు సినీ ఆడియన్స్తో పాటు పలు రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. హీరో పవన్ కళ్యాణ్, తన డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ‘ఓజీ’ సినిమాను ప్రమోట్ చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ సైతం అందుకు బదులు ఇస్తూ.. పుష్ప 2కి (రూ.800+ జీఎస్టీ) ధర ఉందిగా అంటూ ట్వీట్స్ పెడుతున్నారు. 

ఇక మిగతా షోలకు ప్రసెంట్ ఉన్న రేట్లపై అదనంగా సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.125 (GSTతో కలిపి) సవరించిన ధర రూ. 272.5/- అవుతుంది. మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 (GSTతో కలిపి), సవరించిన ఛార్జీ రూ. 327/-గా ఉంటుంది. పెరిగిన ధరలు 10 రోజుల పాటు, అంటే సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 4 వరకు అమలులో ఉండనున్నట్లు ప్రభుత్వం జీవోలో వెల్లడించింది.

అయితే, తెలంగాణ ప్రభుత్వం పవన్ లాస్ట్ మూవీ వీరమల్లుకి టికెట్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. అందువల్ల ఓజీకి కూడా పెంచే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం.

ఇకపోతే ఏపీ ప్రభుత్వం పెంచిన టికెట్‌ ధరలపై ఓజీ నిర్మాణ సంస్థ DVV ఎంటర్‌టైనర్స్‌ స్పెషల్ థ్యాంక్స్ తెలిపింది. ఈ మేరకు X వేదికగా ట్వీట్ చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేసింది. 

ఇదిలా ఉంటే, ‘ఓజీ’ మూవీలో పవన్ కళ్యాణ్ (ఓజాస్ గంభీరా) అనే గ్యాంగ్ స్టార్ పాత్రలో నటిస్తున్నారు. అతను మరొక క్రైమ్ బాస్ ఓమి భావ్ (ఇమ్రాన్ ఖాన్) కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన వీరి పాత్రల గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. పాటలు సైతం కొత్త మ్యూజిక్ టోన్తో ఆకట్టుకుంటున్నాయి. ఇక పవర్ ఫ్యాన్స్కి ‘ఓజీ’తో పండుగ మొదలైనట్టే!