
ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉంటూనే మరోవైపు ఆయన కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. రీసెంట్‌గా ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని కంప్లీట్ చేసిన ఆయన.. ప్రస్తుతం ‘ఓజీ’ మూవీపై ఫోకస్ పెట్టారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘ఓజీ’ ఒకటి. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండేళ్ల క్రితం మొదలైన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయింది.
పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీగా ఉండటంతో షూటింగ్‌కు బాగా గ్యాప్ వచ్చింది. తాజాగా ఆయన ‘ఓజీ’ చిత్రానికి డేట్స్ కేటాయించారు. దీంతో ఈ మూవీ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించినట్టు మేకర్స్ తెలియజేశారు. ‘మళ్లీ మొదలైంది... ఈసారి ముగిద్దాం’ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అతి త్వరలోనే షూటింగ్ పూర్తవనుందని తెలుస్తోంది.
మరో ఇరవై ఐదు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటే మొత్తం షూటింగ్ కంప్లీట్ కానుందని సమాచారం. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు.