Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు కిక్కిచ్చే న్యూస్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు కిక్కిచ్చే న్యూస్

ఇటీవలే వీరమల్లుతో వచ్చిన పవన్ కళ్యాణ్..​ బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయారు. రికార్డులు తిరగరాస్తుందనుకున్న వీరమల్లు.. పెట్టిన బడ్జెట్ కూడా తిరిగి తీసుకురావడంలో కష్టపడుతున్నాడు.

అయితే, దాదాపు మూడేళ్ల తర్వాత వెండితెరపై కనిపించి తన ఫ్యాన్స్కి మాత్రం మంచి బూస్ట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే రికార్డులతో సంబంధం లేకుండా పవన్ తన కొత్త సినిమా అప్డేట్తో మరో గుడ్ న్యూస్ చెప్పారు.

లేటెస్ట్గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి క్రేజీ అప్డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్’ క్లైమాక్స్ షూట్ను పవన్ కంప్లీట్ చేసినట్లు (జూలై 29న) మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేసి వివరాలు వెల్లడించింది నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. 

‘‘ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ షూటింగ్ కంప్లీట్ అయింది. నటకంఠ మాస్టర్ పర్యవేక్షణలో ఎమోషనల్, యాక్షన్ తో కూడిన ఎలక్ట్రిఫైయింగ్ క్లైమాక్స్ పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా క్యాబినేట్ మీటింగ్స్ మరియు బాధ్యతలున్నా, హరి హర వీరమల్లు ప్రమోషన్లలో బిజీగా ఉన్నా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భగత్ సింగ్ షూటింగ్ను వేగంగా పూర్తి చేశారు. ఆయన డెడికేషన్, హార్డ్ వర్కింగ్ స్వభావానికి  ఇది నిదర్శనం’’అని మైత్రి మేకర్స్ Xలో పోస్టు చేశారు. ఈ క్రమంలో ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.

ఈ సినిమా కూడా గబ్బర్ సింగ్ లాగే మరో బ్లాక్ బాస్టర్గా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్న పవన్.. ఉస్తాద్ భగత్ సింగ్ తో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాడనే ఆసక్తి నెలకొంది. అందుకు ముఖ్య కారణం గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పవన్, హరీష్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడమే!

ఈ క్రమంలో సినిమా నుంచే వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరెలాంటి అంచనాలు అందుకోనుందో చూడాలి. ఇకపోతే, ఈ మూవీలో శ్రీలీలతో పాటు మరో హీరోయిన్ రాశీఖన్నా నటిస్తుంది.