
ఓ వైపు పొలిటికల్ టూర్స్, మరోవైపు వరుస సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే సముద్రఖని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటిస్తోన్న సినిమాలో తన పోర్షన్‌ను కంప్లీట్ చేశారు. దీంతో రెండు రోజుల క్రితం హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్‌లో అడుగుపెట్టారు. అలాగే సుజిత్ డైరెక్షన్‌లో రూపొందనున్న ‘ఓజీ’ని కూడా మొదలుపెట్టనున్నారట. ఇటీవల లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నట్టు చెప్పిన టీమ్.. ప్రస్తుతం టెస్ట్ షూట్ జరుగుతోందని రివీల్ చేసింది.
టెస్ట్ షూట్ జరుగుతున్న ఫొటోలను సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీన్ని బట్టి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లోనే ప్రారంభమవుతుందని తెలుస్తోంది. వీటితో పాటు క్రిష్ రూపొందిస్తున్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ని కూడా పవన్ పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌లో పాల్గొంటూ కమిట్ అయిన సినిమాలన్నీ ఈ ఏడాది ఎండింగ్‌లోపే పూర్తి చేయాలనుకుంటున్నారట పవన్ కళ్యాణ్.