Pawan Kalyan: 'హరి హర వీరమల్లు' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి? జూలై 20న వైజాగ్‌లో భారీ ఏర్పాట్లు!

Pawan Kalyan: 'హరి హర వీరమల్లు' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి? జూలై 20న వైజాగ్‌లో భారీ ఏర్పాట్లు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన ' హరి హర వీరమల్లు ' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. భారీ అంచనాలతో రూపుదిద్దుకున్న ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఈ క్రమంలో  ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో భారీ ఎత్తున నిర్వహించేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.  ఈ వేడుకకు దర్శకదీరుడు ఎస్. ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇది అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది.

భారీ అంచనాలతో వస్తున్న  పీరియాడికల్ డ్రామా  'హరి హర వీరమల్లు' మూవీ  ప్రీ-రిలీజ్ ఈవెంట్ జూలై 20న వైజాగ్‌లో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విడుదలవుతున్న ఆయన మొదటి చిత్రం ఇదే కావడంతో, దీనిపై అటు సినీ వర్గాలతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.  ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఎస్.ఎస్. రాజమౌళి హాజరుకావచ్చని ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.  ఒకవేళ రాజమౌళి రావడం ఖాయమైతే, ఇది సినిమాకు మరింత హైప్ తీసుకురావడం ఖాయం అంటున్నారు అభిమానులు.

ఏ.ఎం. రత్నం సమర్పణలో రూపొందిన 'హరి హర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' ప్రపంచ వ్యాప్తంగా జూలై 24న విడుదల కానుంది. ఈ భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామా, ఇప్పటికే రికార్డుల వేటను ప్రారంభించింది. సినిమా విడుదల కావడానికి ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే ఉన్నప్పటికీ, యు.ఎస్.ఎ. (USA) లో ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ అద్భుతమైన వసూళ్లను రాబడుతున్నాయి..

 

ఈ చిత్రానికి  దర్శకుడు క్రిష్ జాగర్లమూడి , ఎఎం జ్యోతి కృష్ట దర్శకత్వం వహించారు.  పవన్ కళ్యాణ్ పీరియాడికల్ డ్రామాలో కనిపించడం, భారీ సెట్టింగ్‌లు, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు,  గ్రాఫిక్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. నిధి అగర్వాల్, నోరా ఫతేహి వంటి నటీమణులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే, బాబీ డియోల్ కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది . ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడికల్ చిత్రం కావడంతో అభిమానుల్లో ఆతృత రెట్టింపు అయ్యింది.