
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ పీరియాడిక్ జానర్‌లో నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఆయన కెరీర్‌లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కూడా ఇదే. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఔరంగజేబుగా నటిస్తున్న బాబీడియోల్‌కు సంబంధించిన సీన్స్ అక్కడ షూట్ చేస్తున్నారట. ఇదిలాఉంటే సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వినిపిస్తోంది.
దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇటీవలే దర్శకుడు క్రిష్ ఈ ఐడియా చెప్పగా పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తు న్నారు. ఎ.ఎమ్.రత్నం, ఎ.దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. మరోవైపు సుజీత్ దర్శ కత్వంలో ఇటీవల ప్రారంభమైన పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘ఓజీ’ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించ బోతున్నట్టు వినిపిస్తోంది.