బాలయ్య బాబు హోస్ట్ గా ఆహాలో టెలికాస్ట్ అవుతున్న అన్‌స్టాపబుల్-2 షో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రికార్డులు సృష్టిస్తోంది. మొదటి సీజన్ తో పోల్చితే ఈ సీజన్ ఎక్కువ క్రేజ్ సంపాధిస్తోంది. ఎవ్వరూ ఊహించని విధంగా గెస్ట్ లను షోకి పిలుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అయితే, తాజాగా ఈ షోలో పాల్గొనడం కోసం పవన్ కళ్యాణ్ అన్నపూర్ణ స్టుడియోకి వెళ్లిన విషయం తెలిసిందే. పవన్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ చేస్తారా అని వేచి చూస్తున్న అభిమానులకు మరొకసారి నిరాశ తప్పేలా లేదు. మొదట ఈ ఎపిసోడ్ సంక్రాంతికి రిలీజ్ చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం పవన్ ఎపిసోడ్ కోసం మరికొంత ఎదురుచూడాల్సి రావొచ్చని తెలుస్తుంది.
సంక్రాంతి కానుకగా కేవలం ప్రొమోని రిలీజ్ చేసి, జనవరి నెలాకరుకు లేదా ఫిబ్రవరి వరకు ఫుల్ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట ఆహా బృందం. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్ ఎపిసోడ్ పార్ట్-1 రిలీజ్ అవగా.. ట్రాఫిక్ వల్ల ఆహా సైట్ క్రాష్ అయిన విషయం తెలిసిందే. ఇంతకంటే ఎక్కువ క్రేజ్ పవన్ ఎపిసోడ్ కి ఉండబోతోందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.