అభిమానిని కలిసి ఆప్యాయంగా మాట్లాడి.. హనుమకొండలో నిరంజన్‌‌‌‌‌‌‌‌ను కలిసిన పవన్‌‌

అభిమానిని కలిసి ఆప్యాయంగా మాట్లాడి.. హనుమకొండలో నిరంజన్‌‌‌‌‌‌‌‌ను కలిసిన పవన్‌‌
  •  హనుమకొండలో మంచానికే పరిమితమైన నిరంజన్‌‌‌‌‌‌‌‌ను కలిసిన పవన్‌‌‌‌‌‌‌‌కల్యాణ్‌‌‌‌‌‌‌‌
  • రూ. లక్ష ఆర్థికసాయం అందజేత, క్యాంటీన్‌‌‌‌‌‌‌‌ పెట్టిస్తానని, ఇల్లు కట్టిస్తానని హామీ
  • పూడుల్‍ కుక్క పిల్ల, ఐపాడ్‍ కొనిస్తానన్న పవన్‌‌‌‌‌‌‌‌
  • భద్రకాళి అమ్మవారికి  ఏపీ డిప్యూటీ సీఎం పూజలు

వరంగల్‍, వెలుగు : మంచానికే పరిమితమైన తన అభిమానిని కలిసేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌ బుధవారం హనుమకొండకు వచ్చారు. వరంగల్‍ కేయూ సమీపంలోని హనుమాన్‍నగర్‍ (పెగడపల్లి డబ్బాల్‍)కు చెందిన పొనుగోటి రాంగోపాల్‍, మాసన దంపతుల కొడుకు నిరంజన్‌‌‌‌‌‌‌‌ ‘డ్యూచెన్‌‌‌‌‌‌‌‌ మస్య్కులర్‌‌‌‌‌‌‌‌ డిస్ట్రోఫి’తో బాధ పడుతున్నాడు. మంచానికే పరిమితం అయిన నిరంజన్‌‌‌‌‌‌‌‌ పవన్‌‌‌‌‌‌‌‌కల్యాణ్‌‌‌‌‌‌‌‌కు ఫ్యాన్‌‌‌‌‌‌‌‌కు మారి, ఏదో ఒకరోజు తన అభిమాన హీరోను కలవాలన్న ఆశతో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్‌‌‌‌‌‌‌‌కల్యాణ్‌‌‌‌‌‌‌‌ బుధవారం హనుమకొండ వచ్చి నిరంజన్‌‌‌‌‌‌‌‌ను కలిశారు. ఉదయం 10.40 గంటలకు నిరంజన్‌‌‌‌‌‌‌‌ ఇంటికి చేరుకున్న పవన్‌‌‌‌‌‌‌‌కల్యాణ్‌‌‌‌‌‌‌‌ తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని అందజేసి, శాలువా కప్పి అక్షింతలు వేసి, నిరంజన్‌‌‌‌‌‌‌‌కు హత్తుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌ నటన, డైలాగ్‌‌‌‌‌‌‌‌లను అనుకరిస్తూ నిరంజన్‌‌‌‌‌‌‌‌ చేసిన వీడియోలను చూసి ఆనందించారు. అనంతరం జనసేనకు సంబంధించిన డైరీలో ‘ప్రియమైన నిరంజన్‍కు ప్రేమతో.. ఆ దుర్గామాత ఆశీస్సులతో నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటూ.. పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‍’ అని రాసి సంతకం చేసిచ్చారు. సుమారు 40 నిమిషాల పాటు నిరంజన్‍తో, ఆయన కుటుంబసభ్యులతో గడిపి 
సెల్ఫీలు దిగారు. 

క్యాంటీన్‌‌‌‌‌‌‌‌ పెట్టిస్తా.. ఇల్లు కట్టిస్తా..

నిరంజన్‌‌‌‌‌‌‌‌ కుటుంబ సభ్యుల మాట్లాడిన పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌ వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. నిరంజన్‌‌‌‌‌‌‌‌ తండ్రి రాము ప్లంబర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తుండగా, తల్లి మానస ఓ క్యాంటీన్‍లో పనిచేస్తోంది. దీంతో వారికి సొంతంగా ఓ క్యాంటీన్‍ పెట్టిస్తానని హామీ ఇచ్చారు. అలాగే నిరంజన్‌‌‌‌‌‌‌‌ డ్రీమ్‌‌‌‌‌‌‌‌ ఏంటని ప్రశ్నించగా... ‘మా ఫ్యామిలీతో కలిసి ఉండేలా మంచి ఇల్లు కావాలని, లాంగ్‍ డ్రైవ్‍ చేయాలి’ చెప్పడంతో తప్పక నెరవేరుస్తానని పవన్‌‌‌‌‌‌‌‌కల్యాణ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. అలాగే హీరో రాంచరణ్ ఇంట్లో ఉండే పూడుల్‍ బ్రీడ్‍ కుక్కపిల్ల కావాలని నిరంజన్‌‌‌‌‌‌‌‌ అడగడంతో పంపిస్తానని చెప్పారు. నిరంజన్‌‌‌‌‌‌‌‌ సినిమాలు చూసేందుకు ఐపాడ్‌‌‌‌‌‌‌‌ కొనిస్తానని చెప్పిన పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌, అందులో తనతో దిగిన ఫొటోలు, సినిమాలన్నీ పెట్టించి ఇవ్వాలని తన సిబ్బందికి చెప్పారు. అనంతరం రూ. లక్ష ఆర్థికసాయం అందజేశారు. 

భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు

నిరంజన్‌‌‌‌‌‌‌‌ను పరామర్శించిన అనంతరం పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‍ వరంగల్‍ భద్రకాళి ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే నిరంజన్‌‌‌‌‌‌‌‌ ఆరోగ్యంగా ఉండాలని అతని పేరుతో పూజ చేసేందుకు నిరంజన్‍ తల్లిదండ్రులను తీసుకెళ్లారు. 

రూ.5 లక్షల సాయం ప్రకటించిన బండ్ల గణేశ్‌‌‌‌‌‌‌‌

అనారోగ్యంతో మంచానికే పరిమితమైన పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌ అభిమాని నిరంజన్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీకి నిర్మాత బండ్ల గణేశ్‌‌‌‌‌‌‌‌ రూ.5 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌ స్ఫూర్తితో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ తరఫున ఈ సాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.