
ఏపీ సీఎం చంద్రబాబుకు తన కొడుకు లోకేష్ భవిష్యత్..జగన్ కు తన భవిష్యత్తు ముఖ్యమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ మాత్రమే మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచిస్తారని అన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని కొణిదెల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ తన ఇంటి పేరుతో ఉన్నకొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు.నంద్యాల లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీకి ఐదేళ్లు అండగా ఉంటే చాలు కర్నూలు రూపురేఖలు మారుస్తామని చెప్పారు.2019 ఎన్నికలు చాలా కీలకమైనవని.. మార్పుకు శ్రీకారం చుట్టి జనసేన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.