
బెంగళూరులోని ఒక పేయింగ్ గెస్ట్(PG) హౌస్ కి అంటించిన నోటీసు ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. అందులో PG హౌస్ రెంట్ డబ్బు రూపంలో మాత్రమే కట్టాలని ఆన్‌లైన్‌లో కడితే మరో 12 శాతం వస్తువులు&సేవల పన్ను (GST) ఛార్జ్ అదనం అని తెలిపింది. భారతదేశం మొత్తం చాలా పీజీలు, హాస్టళ్ల ఓనర్లు ఇప్పుడు అద్దె క్యాష్ రూపంలోనే కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే అద్దెకు 12 శాతం అదనంగా జీఎస్టీ (GST) కట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా డిజిటల్ చెల్లింపులపై జీఎస్టీని తప్పించుకోవడానికే ఇలా చేస్తున్నారని తెలుస్తుంది.
ఈ విషయంపై ఒకతను Xలో ఫొటో పెట్టి పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. అందులో డిజిటల్ చెల్లింపులపై అదనంగా జీఎస్టీ వసూలు చేస్తామని స్పష్టంగా ఉంది. ఎందుకంటే నగదు చెల్లింపుల వల్ల లెక్కలు దాచడం ఈజీ అవుతుంది, అలాగే పన్ను ఎగ్గొట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇలా చేయడం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలకు విరుద్ధం కూడా.
ఈ ఫోటో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు దీనిపై స్పందించడం స్టార్ట్ చేసారు. చాలా మంది రెడ్డిటర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరగా, కొన్ని రోజుల క్రితం చేసిన ఈ పోస్ట్ 31K వ్యూస్ సంపాదించింది.
భారతదేశంలో ప్రస్తుత GST ఫ్రేమ్‌వర్క్ కింద పేయింగ్ గెస్ట్స్ (PGలు), హాస్టల్లను పూర్తిగా పన్ను పరిధిలోకి తీసుకువచ్చారు. జూలై 2022కి ముందు రోజుకు వెయ్యి కంటే తక్కువ రెంట్ ఉన్న పేయింగ్ గెస్ట్స్ హాస్టళ్లకి మినహాయింపు ఉండేది, అంటే బడ్జెట్ పేయింగ్ గెస్ట్స్ హాస్టళ్లు GST పరిధిలోకి రావు . అయితే ఈ మినహాయింపు 2022 మధ్యలో తొలగించింది. అప్పటి నుండి సుంకంతో సంబంధం లేకుండా ఇలాంటి సేవలన్నింటికీ 12% ఫ్లాట్ రేటుతో పన్ను విధించింది.