
‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో పాయల్ రాజ్‌పుత్‌ను హీరోయిన్‌గా పరిచయం చేసిన అజయ్ భూపతి.. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో ‘మంగళవారం’ అనే సినిమా రూపొందిస్తున్నాడు. స్వాతి గునుపాటి, ఎం.సురేష్ వర్మ, అజయ్ భూపతి కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను మంగళవారమే ప్రకటిస్తున్న మేకర్స్.. నిన్న టీజర్‌ను రిలీజ్ చేశారు. పొలాల మధ్య సీతాకోక చిలుకలు గుండ్రంగా ఎగరడంతో ప్రారంభమైన టీజర్‌లో మొదట అమ్మవారి ఆలయాన్ని చూపించారు.
ఆ తర్వాత అందరూ ఏం జరగబోతుందా అన్న భయంతో పైకే చూస్తున్నట్లుగా కనిపించారు. బోల్డ్ సీన్స్‌లో కనిపిస్తూ, మధ్యలో ఏడుస్తూ కోపంతో అరుస్తున్నట్టుగా పాయల్ కనిపించడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. నైంటీస్‌లో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ‘ఫియర్ ఇన్ ఐస్’ పేరుతో ఈ టీజర్‌ను రిలీజ్ చేసిన అజయ్ భూపతి.. అన్నట్టుగానే నటీనటులందరి కళ్లలో భయాన్ని చూపించాడు. అలాగే ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ టీజర్‌కి హైలైట్‌గా ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.