డిపాజిట్ పరిమితి లక్ష నుంచి రెండు లక్షలకు పెంపు

డిపాజిట్ పరిమితి లక్ష నుంచి రెండు లక్షలకు పెంపు

ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంతో రెపో రేటు 4శాతం, రివర్స్ రేటు 3.5శాతం వద్దే కొనసాగనున్నాయి. రేట్లను యథాతథంగా ఉంచాలని మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందన్నారు RBI గవర్నర్ శక్తికాంత దాస్. 2021- 22 ఆర్థిక సంవత్సరానికి GDP వృద్ధి రేటు 10.5 శాతంగా ఉంటుందని అంచనా వేసిందన్నారు. అలాగే సీపీఐ ద్రవ్యాల్బణం 5.1 శాతంగా ఉంటుందని తెలిపిందన్నారు శక్తికాంతదాస్. అలాగే పేమెంట్స్ బ్యాంక్స్ డిపాజిట్  లిమిటెడ్ ను రూ. లక్ష నుంచి రెండు లక్షలకు పెంచింది.