
50 రోజుల పాటు అభిమానులని అలరిస్తూ వస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌కు బ్రేక్ పడింది. ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ నేపథ్యంలో మెగా లీగ్‌ను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు బీసీసీఐ శుక్రవారం(మే 8) ప్రకటించింది. గురువారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్–ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అర్ధంతరంగా నిలిపివేయడంతో మెగా లీగ్ కొనసాగడంపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ‘ఐపీఎల్2025 మిగిలిన మ్యాచ్‌లను తక్షణమే ఒక వారం పాటు నిలిపివేయాలని బీసీసీఐ నిర్ణయించింది’ అని బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా ఒక ప్రకటనలో తెలిపారు.
ఐపీఎల్ ఎప్పుడు మొదలవుతుందో ఒక అంచనాకు రావడం లేదు. బీసీసీఐ అధికారులు, ఒక వారం అని చెప్పినా ఈ మెగా లీగ్ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశం లేనట్టుగా కనిపిస్తుంది. ఇంగ్లాండ్ టూర్ తర్వాత ఐపీఎల్ మొదలవుతుందని రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. ఐపీఎల్ ఎప్పుడు మొదలైనా ఎక్కడ నుంచి ఆగిపోయిందో అక్కడ నుంచి ప్రారంభం కానుంది. పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగబోయే మ్యాచ్ మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య గురువారం (మే 7) మ్యాచ్ ప్రారంభమైంది.
ఈ మ్యాచులో టాస్ గెలిచి పంజాబ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో బ్లాక్ ఔట్ ప్రకటించడంతో మ్యాచ్ మధ్యలో నిలిచిపోయింది. ఈ రెండు జట్ల మధ్య పున ప్రారంభం కానున్న మ్యాచ్ లో మరల టాస్ వేసి మొదటి ఫ్రెష్ గా స్టార్ట్ చేయనున్నారని సమాచారం. అలా జరిగితే పంజాబ్ కు నష్టమే. చివరి 10 ఓవర్లలో పంజాబ్ మరో 100 పరుగులు రాబట్టిన ప్రత్యర్థి ఢిల్లీ ముందు దాదాపు 220 పరుగుల భారీ లక్ష్యం ఉంచే అవకాశం ఉంది. కానీ పంజాబ్ కు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.
The PBKS vs DC clash will officially restart from ball 1 when the tournament resumes!🏏🇮🇳 pic.twitter.com/Ulu0xipWna
— CricketGully (@thecricketgully) May 10, 2025