ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రాండ్గా భాస్కర్ రెడ్డి బర్త్ డే వేడుకలు

 ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రాండ్గా భాస్కర్ రెడ్డి బర్త్ డే వేడుకలు

కోటగిరి, వెలుగు: మండల కేంద్రంలో ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు పీబీఆర్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పీబీఆర్ యువసేన నాయకుడు జుబేర్ ఆధ్వర్యంలో భారీ కటౌట్ ఏర్పాటు చేసి కేక్ కట్ చేశారు. ఒకరికొకరు కేక్ తినిపించుకుని భాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్​లో విద్యార్థులకు పండ్లు, బిస్కెట్ పాకెట్లు పంపిణీ చేశారు. సీనియర్ నాయకుడు ఎజాస్ ఖాన్ మాట్లాడుతూ పోచారం వారసుడిగా భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని ఆకాంక్షించారు. 

 బాన్సువాడ నియోజకవర్గ ప్రజలను విద్య, వైద్య సహకారంతోపాటు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారని చెప్పారు.  కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్, జడ్పీ కో ఆప్షన్ మాజీ మెంబర్ సిరాజ, శివరాజ్ పాటిల్, కృష్ణారెడ్డి, బాబు ఖాన్, జమీర్, సుదర్శన్ పాల్గొన్నారు. 

పోతంగల్ లో.. 

పోతంగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు డీసీసీబీ మాజీ  చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సంబురాలు జరుపుకొన్నారు.  కేక్ కట్​ చేసి భాస్కర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు అధ్యక్షుడు పుప్పాల శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గంధపు రాజు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చాంద్ పాషా, పోతంగల్ మాజీ సర్పంచ్ వర్ణి శంకర్, సుదం ధనరాజ్, బజరంగ్ దత్తు, శివరాజ్ పటేల్, మండల సీనియర్ నాయకులు ఎజాస్ ఖాన్, నబీ, రామ్ బాబు  పాల్గొన్నారు. 

బీర్కూర్​ మండలంలో..

బీర్కూర్, వెలుగు: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో తండ్రి బాటలో నడుస్తున్న డీసీసీబీ మాజీ చైర్మన్​ పోచారం భాస్కర్​ రెడ్డి  మరెన్నో జన్మదిన వేడుకలు నిర్వహించుకోవాలని బీర్కూర్, నస్రుల్లాబాద్ కాంగ్రెస్​ నాయకులు ఆకాంక్షించారు. బుధవారం బీర్కూర్​ మండలంలోని ఆయా గ్రామాల్లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.  నెమ్లి సాయిబాబా ఆలయం, బీర్కూర్​ మండల కేంద్రంలోని పలు ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం కేక్​ కట్ చేసి  భాస్కర్ రెడ్డికి  శుభాకాంక్షలు తెలిపారు.  

బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, ఏఎంసీ వైస్​ చైర్మన్ యామ రాములు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, యూత్ లీడర్ శశికాంత్​, లీడర్లు ఏడే మోహన్, మహేశ్​పటేల్, శ్రీనివాస్, పురం వెంకట్, మారుతి, కంది మల్లేశ్ పాల్గొన్నారు.