- పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని, ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీనియర్ నేత కడియం శ్రీహరిని నిండు సభలో కాల్చిపారేయాలని కౌశిక్ మాట్లాడిన తీరు పార్లమెంటరీ విధానాలకు విరుద్ధమని ఆరోపించారు.
కౌశిక్ రెడ్డి ఓ ఎమ్మెల్యేగా కాకుండా, వీధి రౌడిలా వ్యవహరించారని, ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రాబోయే రెండున్నరేళ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ కు వంతపాడుతున్న కేటీఆర్, హరీశ్ భేషరతుగా కడియం శ్రీహరికి క్షమాపణలు చెప్పాలని కోరారు.
