పవన్ ఖేరా భార్యను  విమర్శించే హక్కు నీకెక్కడిది?..అసదుద్దీన్ ఓవైసీపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్

పవన్ ఖేరా భార్యను  విమర్శించే హక్కు నీకెక్కడిది?..అసదుద్దీన్ ఓవైసీపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: యూపీలో మజ్లిస్ అధినేత కార్యకలాపాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పవన్ ఖేరా స్పందించారని, ఆయనకే కౌంటర్ ఇవ్వాల్సిన ఒవైసీ అది మరిచిపోయి, పవన్ ఖేరా భార్య కోట నీలిమను విమర్శించడం ఏమిటని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

పవన్ ఖేరా భార్య రాజకీయ నాయకురాలని, ప్రత్యేక గుర్తింపు ఉన్న మహిళా అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ను, పవన్ ఖేరాను విమర్శించే హక్కు ఓవైసీకి ఉన్నా.. రాజకీయ కక్ష తీర్చుకోవడానికి ఒక మహిళ గౌరవాన్ని కించపరచడం తగదన్నారు. ఇది మజ్లిస్ అధినేత రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటికైనా ఓవైసీ.. పవన్ ఖేరా భార్యపై చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకొని ఆమెకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.