
- బీసీలను వంచించిన కేసీఆర్ కూతురువు నువ్వు
- 42% రిజర్వేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
- గత పాలకులు బీసీ రిజర్వేషన్లు తగ్గించారు
- బీఆర్ఎస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలె
- పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్: బీసీలకు 42% రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు కాంగ్రెస్ మేలు చేస్తే కవిత ఎందుకు రంగులు పులుముకుంటుందని ప్రశ్నించారు. కవితకు, భవితకు సంబంధం లేదని అన్నారు. రాహుల్ గాంధీ ఆదేశం మేరకు రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను వంచించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీ రిజర్వేషన్లు తగ్గించిన ఘనత కేసీఆర్ దని అన్నార. కేసీఆర్ కూతురైన కవిత పండుగ చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని చెప్పారు. బీసీల విషయంలో చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు.
►ALSO READ | ఐక్యంగా ఉంటేనే హక్కులు దక్కుతయ్... సింహ గర్జనతో కొంతమంది నోర్లు మూతపడ్డయ్