- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నయ్
- పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్
కామారెడ్డి, వెలుగు: మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. మంగళవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరులో వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి పాల్గొన్నారు.
స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాల చెక్కులు, చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమి లేదని, 50 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వేలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లోనే 80 వేల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు.
షబ్బీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గానికి రూ.3.25 కోట్ల వడ్డీలేని రుణాలు వచ్చాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండోసారి వడ్డీ లేని రుణాలు అందించిందని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ విక్టర్, డీఆర్డీవో సురేందర్, లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
