
నిజామాబాద్ లో గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జిల్లా కేంద్రంలోని దుబ్బ చౌరస్తా దగ్గర గణేష్ నిమజ్జన శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు మహేష్ కుమార్ గౌడ్. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కీలక చేశారు మహేష్ కుమార్ గౌడ్.
పార్టీలకతీతంగా శోభాయాత్ర జరుగుతోందని.. అందరు భక్తి శ్రద్దలతో ఊరేగింపులో పాల్గొంటున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రానికి అరిష్టాలు తొలగిపోయి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వియకుడిని కోరుకున్నట్లు తెలిపారు మహేష్ కుమార్ గౌడ్.అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందని.. వినాయకుడిని ఆశీస్సులతో ఉండాలని ప్రార్థిస్తున్నానని అన్నారు మహేష్ కుమార్ గౌడ్.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది నిజామాబాద్ జిల్లాలో గణేష్ ఉత్సవాలు చాలా ఖరీదైన వేడుకగా జరిగినట్లు తెలుస్తోంది. భక్తులు పోటాపోటీగా నిర్వహించిన ఈ వేడుకలకు సుమారు రూ. వంద కోట్లకు మించి టర్నోవర్ జరిగినట్లు తెలుస్తోంది. వినాయక విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం దాకా.. నిర్వాహకులు ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఇరవై ఏండ్ల క్రితం ఊరు మొత్తానికి కలిపి ఒకటి, రెండు విగ్రహాలు ఉండేవి. పట్టణాల్లో అయితే గరిష్ఠంగా పది విగ్రహాలు దాటపోయేవి. వీటి సంఖ్య ఇప్పుడు ఏకంగా 7 వేలకు చేరాయి. గణేశ్ నవరాత్రి ఉత్సవాలతో పేదలకు ఉపాధి లభిస్తుంది.