
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు పూర్తైన సందర్భంగా 17 ప్రధాన పథకాలపై పోస్టర్ విడుదల చేశారు పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్. 17 నెలల పాలనలో అమలులోకి తెచ్చిన 17 ప్రధాన సంక్షేమ పథకాల కరపత్రాలను గాంధీ భవన్ లో ఆవిష్కరించారు.
టీపీసీసీ కార్యదర్శి బోడు రాకేష్ కుమార్ రూపొందించిన ఈ కరపత్రాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం కోసం పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ పోస్టర్లను వినియోగించనున్నారు. ‘తెలంగాణలో ప్రజా ప్రభుత్వం 17 నెలల పాలనలో సంక్షేమం’ అనే పేరున ఈ పోస్టర్లను విడుదల చేశారు.
17 ప్రధాన పథకాలు:
1. రైతు రుణమాఫీ
2. రైతు భరోసా
3. ఇందిరమ్మ ఇండ్లు
4. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
5. 200 యూనిట్ల ఉచిత విద్యుత్
6. రూ. 600 కే గ్యాస్ సిలిండర్
7. సన్న బియ్యం పంపిణీ
8. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
9. రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ
10. రాజీవ్ యువ వికాసం
11. మూసీ ప్రక్షాళన
12. 63,310 ప్రభుత్వ ఉద్యోగాలు
13. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్
14. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్
15. వర్గీకరణ
16. ఫ్యూచర్ సిటీ వైపు అడుగులు
17. హెల్త్ యూనివర్సిటీ