కొత్త ఏడాదిలో తిక్క రేగితే.. జైల్ భరో కార్యక్రమం చేస్తాం

కొత్త ఏడాదిలో తిక్క రేగితే.. జైల్ భరో కార్యక్రమం చేస్తాం

పోలీసు వ్యవస్థ  కేసీఆర్ చేతిలో ప్రైవేటు  సైన్యంగా  మారిందన్నారు పీసీసీ  చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాలను  అడ్డుకోవడానికే పోలీసులను వినియోగిస్తున్నారన్నారు. మంత్రులు ఎక్కడ  కార్యక్రమాల్లో  పాల్గొన్నా.. తాము  అడ్డుకుంటామన్నారు. నల్గొండలో  కేటీఆర్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని  పిలుపునిచ్చారు. కొత్త ఏడాదిలో తిక్కరేగితే  జైల్ భరో కార్యక్రమం చేపడతామన్నారు.  ఏం చేసినా చెల్లుతుందని  కేసీఆర్  అహంభావంతో  ఉన్నారన్నారు. ప్రభుత్వాన్ని  చూసి  ప్రజలు చనిపోయే  పరిస్థితి  వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. స్థానికులు, స్థానికేతరులు అని ఉద్యోగుల్లో చిచ్చు రేపిండన్నారు. 317 జీవో రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. అర్థరాత్రి నుండే తన ఇంటిని పోలీసులు ముట్టడించారన్నారు. కనీసం సమాచారం ఇవ్వకుండా తన ఇంట్లోకి చొరబడ్డారని.. మహబూబాబాద్ ఏమైనా పాకిస్తాన్ లో ఉందా? అని ప్రశ్నించారు.