కేటీఆర్‌‌కు జ్ఞానం లేదు.. నేను టీడీపీ అయితే కేసీఆర్ ఏంది?

కేటీఆర్‌‌కు జ్ఞానం లేదు.. నేను టీడీపీ అయితే కేసీఆర్ ఏంది?

తాను టీడీపీ అయితే కేసీఆర్ ఏంటని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. TRSలో ఉన్న టాప్ లీడర్లంతా తెలుగుదేశం వాళ్లే అన్నారు. తాను చంద్రబాబు దగ్గర సహచరుడిలా పనిచేస్తే.... కేసీఆర్ బానిసలా ఉన్నాడన్నారు. కేసీఆర్, కేటీఆర్ లకు తెలుగుదేశం భిక్ష వేస్తే... హరీశ్ రావుకు కాంగ్రెస్ భిక్ష పెట్టిందన్నారు. కేటీఆర్ కు జ్ఞానం లేదన్నారు రేవంత్. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే తోపు అయిపోరన్నారు. కేటీఆర్ లా తాను రెడీ మేడ్ కుర్చీలో కూర్చోలేదన్నారు. హిమన్షును కేటీఆరే చెడగొడుతున్నారన్నారు. మీడియాతో చిట్ చాట్ చేసిన రేవంత్  ఇప్పటి నుంచి కేటీఆర్ అని పిలవను .. డ్రామా రావు అని పిలుస్తానన్నారు.  కేటీఆర్ అని పిలుస్తే..ఎన్టీఆర్ పరువుతీసినవాళ్లం అవుతామన్నారు. కేసీఆర్ జీవితం, జీవనం మొత్తం తెలుగుదేశమే కదా అని అన్నారు. జలవివాదంలో జగన్, కేసీఆర్ లవి.. సురభి నాటకాలన్నారు.