పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అరెస్టు

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అరెస్టు

నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ పీఠం టీఆర్ఎస్ దక్కించుకుంది. చైర్మన్ ఎన్నిక అడ్డదారిలో జరిగిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అడ్డదారిలో చైర్మన్ కుర్చీ కైవసం చేసుకుందని ఆరోపిస్తూ.. ధర్నాకు దిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.  నిన్నటి లిస్టు ప్రకారం సభ్యుల ఎన్నిక జరిగితేనే తాము ఎన్నికలో పాల్గొంటామని ఎన్నికల అధికారులతో ఆయన అన్నారు. కానీ.. అలా జరగకపోవడంతో కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈసీ నాగిరెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. చైర్మన్ ఎన్నికకు వ్యతిరేకంగా నేరేడుచర్ల సెంటర్‌లో ఉత్తమ్, కేవీపీ ధర్నాకు దిగారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేసి మిర్యాలగూడకు తరలించారు.

For More News..

నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ పీఠం టీఆర్ఎస్‌దే

జాబ్ కన్నా.. బిజినెస్ బెటర్ అంటున్న యువతులు

కారు డ్రైవర్లకు ఫుల్ డిమాండ్