తెలంగాణ ఇచ్చిన పార్టీ.. మీకు థర్డ్ క్లాస్ పార్టీనా?

తెలంగాణ ఇచ్చిన పార్టీ.. మీకు థర్డ్ క్లాస్ పార్టీనా?
  • కేటీఆర్​పై పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం ఫైర్

హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్​ను థర్డ్ క్లాస్ పార్టీ అని కేటీఆర్ చేసిన కామెంట్లపై పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి, మనకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్.. థర్డ్ క్లాస్ పార్టా? లేక ఉద్యమం పేరుతో డబ్బులు వసూలు చేసిన బీఆర్ఎస్ థర్డ్ క్లాస్ పార్టా? అనేది కేటీఆరే చెప్పాలని నిలదీశారు. గురువారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. 

సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ పది జన్మలు ఎత్తినా సీఎం అయ్యేవాడా? అని ప్రశ్నించారు. సోనియా గాంధీ కాళ్లు మొక్కి, కాంగ్రెస్ లో బీఆర్ఎస్​ను విలీనం చేస్తామని చెప్పి,  ఆ తర్వాత మాట మార్చిన మీ పార్టీ థర్డ్ క్లాస్ కాదా? అని కేటీఆర్​పై మండిపడ్డారు.