రాజకీయాలు మాని బాధితులను ఆదుకోండి : పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం

రాజకీయాలు మాని బాధితులను ఆదుకోండి : పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం
  • బీఆర్ఎస్, బీజేపీలకు పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం సూచన

హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాలకు తెలంగాణ అతలాకూతలం అవుతున్న సమయంలో ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిందిపోయి రాజకీయాలు చేయడం ఏమిటని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ప్రశ్నించారు. గురువారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ బాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. 

సీఎం ఇప్పటికే ఏరియల్ సర్వే చేసి, మెదక్ జిల్లాలో జరిగిన నష్టంపై అధికారులతో సమావేశమై సమీక్ష చేశారని, మంత్రులంతా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని చెప్పారు. వరదల్లో ఆస్తులు కోల్పోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని, ఈ సమయంలో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ముందుకొచ్చి ఆదుకోవాలని కోరారు.