
హైదరాబాద్, వెలుగు: బూత్ లెవెల్ఆఫీసర్లు ఓటర్ స్లిప్పులను పూర్తి స్థాయిలో పంచడం లేదని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఆరోపించారు. రేపటితో ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తవనుండగా.. మరో ఐదు రోజుల్లో ప్రచారం ముగియనుందని గుర్తుచేశారు. 26న అన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటర్ స్లిప్పులను అందుబాటులో ఉంచాలన్నారు. హోం ఓటుపై అధికారులు తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు.
ఒక్కో నియోజకవర్గంలో ఎన్ని అప్లికేషన్లు వచ్చాయో సమాచారం లేదని వాపోయారు. 80 ఏండ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచి ఓటేసేటప్పుడు వీడియో తీయాలని కోరారు. తమకు ఓటేయకుంటే పెన్షన్ ఆగిపోతుందంటూ బీఆర్ఎస్ నేతలు వృద్ధులను భయపెడుతున్నారని విమర్శించారు. ఈ అంశంపై సీఈవో వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.