
హైదరాబాద్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి విద్యాశాఖపై కనీస అవగాహన లేదన్నారు PCC అధికార ప్రతినిధి గజ్జెల కాంతం. ఇంటర్ బోర్డు అధికారులు, విద్యాశాఖ మంత్రి అసమర్థత వల్లే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు గజ్జెల కాంతం. ఇంటర్ బోర్డు అధికారులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలన్న ఆయన… బాధితుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.