
- అవినీతి సర్కార్ పై కాంగ్రెస్ పోరాటం ఆగదు
- పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్
షాద్‌నగర్, వెలుగు : విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆస్తులపై ప్రత్యేక విచారణ జరిపించాలని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ డిమాండ్ చేశారు. మద్దూరు వద్ద 120 ఎకరాల ఫాంహౌస్‌ను మంత్రి ఎలా సంపాదించారని ఆయన ప్రశ్నించారు. షాద్‌నగర్ టౌన్ సబ్ స్టేషన్ ఎదుట సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడితే బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ శాఖలోని కుంభకోణాలు, అవినీతి, అక్రమాలతో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ కొనుగోలులో అవినీతిపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. పట్టణ అధ్యక్షుడు కొంకల్ల చెన్నయ్య, కాంగ్రెస్ సీనియర్ నేతలు బాబర్ తదితరులు పాల్గొన్నారు.