జస్టిస్ నర్సింహారెడ్డిపై వ్యాఖ్యలు... కేసీఆర్ అహంకారానికి నిదర్శనం

జస్టిస్ నర్సింహారెడ్డిపై వ్యాఖ్యలు... కేసీఆర్ అహంకారానికి నిదర్శనం

హైదరాబాద్, వెలుగు: పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డిని విచారణ నుంచి తప్పుకో అని మాజీ సీఎం కేసీఆర్ అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ అన్నారు. పదేండ్లు సీఎంగా చేసిన వ్యక్తి, చీఫ్ జస్టిస్‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన వ్యక్తిపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఓడినా ఇంకా కేసీఆర్ తీరు మారలేదన్నారు.

ఇప్పటికీ తానే మేధావి, తనకే అన్ని తెలుసు, చట్టం ముందు తాను అతీతుడని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ నుంచి కరెంటు కొనుగోలుపై కమిషన్‌‌‌‌‌‌‌‌కు వివరణ ఇవ్వకుండా, తిరిగి కమిషన్‌‌‌‌‌‌‌‌పైనే ఆరోపణలు, ప్రతిదాడి చేస్తూ లేఖ రాయడం చట్ట విరుద్ధమన్నారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ 25 మందిని వివరణ కోరితే.. కేసీఆర్ ఒక్కడే ఇలా వ్యవహరించారన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ జరపాలని నిరంజన్ కోరారు.