కేటీఆర్ ఆస్తులపై సీబీఐ ఎంక్వైరీ చేయాలి : పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ డిమాండ్

కేటీఆర్ ఆస్తులపై సీబీఐ ఎంక్వైరీ చేయాలి :  పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ డిమాండ్
  •     పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌ఎస్ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్ అక్రమ ఆస్తులపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ డిమాండ్ చేశారు. బుధవారం గాంధీ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. 2009 నుంచి 2023 వరకు కేటీఆర్ ఆస్తుల పెరుగుదలపై ఎంక్వైరీ చేయాలని సీబీఐని కోరారు. ఈ మధ్య కాలంలో ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఆస్తుల వివరాలను ప్రజలకు తెలుపాలని డిమాండ్ చేశారు. 

పెద్ద ఎత్తున ఆస్తులు పెరగడానికి కారణాలేమిటో  ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్​పై ఉందని, దీనిపై చర్చకు రావాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు.  రూ.4 కోట్ల నుంచి రూ.53 కోట్లకు ఆస్తులు ఎలా పెరిగాయో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. కేటీఆర్​అక్రమ ఆస్తులపై సిట్టింగ్​జడ్జితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు.