ఇవి ఆరోగ్యానికి చాలా మేలు

ఇవి ఆరోగ్యానికి చాలా మేలు

హెల్దీ ఫుడ్‌‌ ఐటమ్స్‌‌ లిస్ట్‌‌లో బెల్లం, మొలకెత్తిన శనగల్ని కూడా చేర్చుకోండని చెప్తున్నారు హెల్త్‌‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌. బెల్లంలో ఐరన్‌‌, మెగ్నీషియం, క్యాల్షియం ఉంటాయి. మొలకెత్తిన శనగల్లో ప్రొటీన్స్‌‌, విటమిన్స్‌‌ ఉంటాయి. వీటిని కలిపి తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.  

  • శరీరంలో ఎర్ర రక్త కణాల శాతం తగ్గడంవల్ల రక్తహీనత (ఎనీమియా) వస్తుంది. ఈ సమస్యతో బాధ పడేవాళ్లు మొలకెత్తిన శనగలు, బెల్లం కలిపి తినాలి. వీటిలో ఉండే ఐరన్‌‌ రక్తంలో ఆక్సిజన్, ఎర్ర రక్త కణాల శాతాన్ని పెంచుతుంది. దాంతో రక్తహీనత తగ్గుతుంది.
  • రోజూ గుప్పెడు మొలకెత్తిన శనగలు, బెల్లం కలిపి తినాలి. వీటిలోని కాల్షియం ఎముకలు, పళ్లను బలంగా తయారుచేస్తుంది.
  • వీటిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం లాంటి పోషకాలు బీపీని అదుపులో ఉంచుతాయి. అంతేకాదు మొలకెత్తిన శనగలు, బెల్లం తినడం వల్ల హార్ట్‌‌ ప్రాబ్లమ్స్‌‌ దరి చేరవు.
  • మొలకెత్తిన శనగల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి జీర్ణ సమస్యల్ని దూరం చేస్తుంది.