చదువుతోపాటు ఆటల్లోనూ సత్తా చాటాలి : కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌‌‌‌లాల్

చదువుతోపాటు ఆటల్లోనూ సత్తా చాటాలి : కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌‌‌‌లాల్

జ్యోతినగర్, వెలుగు : స్టూడెంట్స్‌‌‌‌ చదువుతోపాటు ఆటల్లోనూ సత్తా చాటాలని పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌‌‌‌లాల్ సూచించారు. రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ సీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో  మంగళవారం టౌన్ షిప్ ఎంజీ స్టేడియంలో ఏర్పాటు చేసిన  గ్రామీణ ఆటల పోటీలను ప్రాజెక్ట్ ఈడీ కేదార్ రంజన్ పాండుతో కలిసి ఆయన ప్రారంభించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణా క్రీడాకారులను ఎన్టీపీసీ ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే  స్టూడెంట్స్ కోసం ఎన్టీపీసీ ఎన్నో వసతులు కల్పిస్తోందన్నారు. ప్రాజెక్ట్ ఈడీ మాట్లాడుతూ.. ప్రాజెక్ట్  ప్రభావిత గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.