సింగరేణి కార్మికులకు అండగా నిలిచింది కాంగ్రెస్ ఒక్కటే: గడ్డం వంశీకృష్ణ

సింగరేణి కార్మికులకు అండగా నిలిచింది కాంగ్రెస్ ఒక్కటే: గడ్డం వంశీకృష్ణ

డబ్బులు సంపాదించుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. కాకా స్ఫూర్తితో ప్రజలకు సేవ చేసేందుకు  మీ ముందుకు వచ్చానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను మీ కుటుంబ సభ్యుడిలా ఆదరించి గెలిపించాలని కోరారు. రామగుండం సింగరేణి ఏరియా గోదావరిఖని 11వ బొగ్గు గనిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాయిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగరేణి నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడిన ఘనత కాకా వెంకటస్వామిదన్నారు. సింగరేణి కార్మికులకు అండదండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని చెప్పారు. కాక లేబర్ యూనియన్ పెట్టి కార్మిక నాయకుడిగా కార్మికుల సంక్షేమం కోసం పోరాడారని తెలిపారు. 

ప్రభుత్వ సంస్థలు వస్తేనే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు గడ్డం వంశీకృష్ణ.  సింగరేణిలో కొత్త బొగ్గు గనులను తీసుకొస్తామన్నారు. సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపుతో పాటు కార్మికుల సొంతింటి కల అమలుకు కృషి చేస్తామని చెప్పారు. భారత దేశం మొత్తాన్ని సింగరేణి సంస్థ వెలిగిస్తుందన్నారు.  కార్మికులు బాగుంటే సంస్థ  సింగరేణి బాగుంటుంది.. సంస్థ బాగుంటే సింగరేణి కార్మికులు బాగుంటారని తెలిపారు.

రామంగుండంను బొందల గడ్డగా మార్చారు


సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.సింగరేణి కార్మిక కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించేందుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గత పాలకులు రామగుండంను బొందల గడ్డగా మార్చారని చెప్పారు. ఆదాయపన్ను సడలింపునకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.సింగరేణి కార్మికులకు ఇండ్ల పట్టాలు ఇచ్చే బాధ్యత  తనదన్నారు