పెద్దపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ పదవికాలం పొడగింపు…

పెద్దపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ పదవికాలం పొడగింపు…

పెద్దపల్లి జాయింట్ కలెక్టర్ పదవి కాలాన్ని పొడగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎం.వనజాదేవి అనే ఆఫీసర్ పెద్దపల్లి జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా పని చేస్తున్నారు. వీరి పదవి కాలం జులై31, 2019 తో  ముగియనుంది. అయితే వనజాదేవి సేవలు మరికొంతకాలం ప్రజలకు అవసరమని వారి పదవికాలాన్ని పొడిగించమని ప్రభుత్వాన్ని కోరారు ఆ జిల్లా కలెక్టర్.  ఇందుకు గాను… వనజాదేవిని మరో సంవత్సరం పాటు కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటూ ఆర్డర్స్ ను ఇచ్చింది. దీంతో వనజాదేవి మరో సంవత్సరం కొనసాగనున్నారు. దీనికి సంబంధించి అవసరమైన చర్యలను సిసిఎల్ఎ తీసుకుంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.