పెద్దపల్లిలో వంశీకృష్ణకి బంపర్ మెజారిటీ ఖాయం : జీవన్ రెడ్డి

పెద్దపల్లిలో  వంశీకృష్ణకి బంపర్ మెజారిటీ ఖాయం : జీవన్ రెడ్డి

జగిత్యాల/రాయికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: పెద్దపల్లి లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ  బంపర్ మెజారిటీ తో గెలవనున్నారని నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ధర్మపురి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కొప్పుల ఈశ్వర్ తన నియోజకవర్గంలో దశాబ్ద కాలంలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని విమర్శించారు. ఏడాదికి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు నిర్మించే ప్రక్రియ ఎన్నికల తర్వాత ప్రారంభం అవుతుందన్నారు. 

లోక్ సభ ఎన్నికల పద్మవ్యూహంలో ప్రవేశించానని, తనను అభిమాన్యున్ని చేస్తారో అర్జునుడిని చేస్తారో ఓటర్ల చేతుల్లో ఉందని పేర్కొన్నారు.  అనంతరం రాయికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగిన కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు ఆర్ఎంపీలు జీవన్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు.  చేరిన వారిలో ఆర్ఎంపీలు వాసం గోవర్ధన్, అస్లం , బైరి సుకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాగర్ , సంతోష్ తదితరులు ఉన్నారు. 

కేంద్రంలో కాంగ్రెస్ రావడం పక్కా

మెట్ పల్లి: వచ్చే నెల జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని ఎమ్మెల్సీ, నిజామాబాద్  లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. గురువారం మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి పట్టణానికి చెందిన బీఆర్ఎస్  సీనియర్ నాయకుడు బర్ల సాయన్న కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా సాయన్నతో పాటు సుమారు వెయ్యి మంది అనుచరులు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కోరుట్ల నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి జువ్వాడి నర్సింగారావు, సుజిత్ రావు, జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి కరం,  విజయ్ ఆజాద్, ఆకుల లింగారెడ్డి, శాకీర్, మహమ్మద్, ఖుతూబొద్దీన్ పాషా, లింగారెడ్డి పాల్గొన్నారు.