ఆర్చరీ గోల్డ్ మెడల్ విన్నర్ చికితకు పెద్దపల్లి ఎంపీ అభినందనలు

ఆర్చరీ గోల్డ్ మెడల్ విన్నర్ చికితకు పెద్దపల్లి ఎంపీ అభినందనలు

ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో స్వర్ణపతకం గెలుచుకున్న తానిపర్తి చికితకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అభినందనలు తెలిపారు. గురువారం (ఆగస్టు 28) బంగారు పతకంతో స్వస్థలానికి చేరుకున్న సందర్భంగా చికితను అభినందించారు ఎంపీ. 

మహిళల కాంపౌండ్ విభాగంలో ప్రపంచలో ఎంతో మందిని వెనక్కి నెట్టి బంగారు పతకం సాధించడం గొప్పవిషయం అని కొనియాడారు. 20 ఏళ్ల వయసులో నాకౌట్  దశలో అద్భుత ఆటతీరు కనబరిచి క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. 

చికిత తానిపర్తి పెద్దపల్లి జిల్లాకు చెందిన క్రీడాకారిణి కావడం గర్వకారణం అని అన్నారు. ఆమెకు అన్ని విధాల అండగా ఉంటామని ఎక్స్ వేదికగా అభినందించారు. 

►ALSO READ | సెకండ్ క్లాస్ నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టా.. వరల్డ్ ఆర్చరీ గోల్డ్ మెడల్ విన్నర్ చికిత

చికిత తానిపర్తి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన క్రీడాకారిణి. ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్స్‌లో అండర్-21 మహిళల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. కెనడా టూర్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చిన చికిత.. సొంతగడ్డకు వస్తున్న క్రమంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు క్రీడాకారులు పెద్ద ఎత్తున చేరుకుని స్వాగతం పలికారు.