మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ వంశీకృష్ణ..

మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ వంశీకృష్ణ..

మంగళవారం ( జనవరి 6 ) మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఆసుపత్రిలో గదులను పరిశీలించి రోగుల సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని.. రోగులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఉండాలని అధికారులకు సూచించారు వంశీకృష్ణ.

ఆస్పత్రిలో సరిపడా మెడిసిన్స్ కూడా లేవని తన దృష్టికి వచ్చిందని.. మరోసారి అలాంటి సమస్య రాకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వంశీకృష్ణ. అనంతరం జిల్లా కేంద్రంలోని మార్కెట్ ను సందర్శించిన ఎంపీ వంశీకృష్ణ కూరగాయల వ్యాపారులతో మాట్లాడి మార్కెట్లోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఇదిలా ఉండగా సోమవారం ( జనవరి 5 ) పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఎంపీ వంశీకృష్ణ ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్ర చేస్తోందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఓదెలలో నిర్మించనున్న ఆర్‌‌‌‌‌‌‌‌ఓబీ కోసం స్థలం పరిశీలించేందుకు వెళ్లిన ఎంపీ.. కాల్వ శ్రీరాంపూర్​ మండలం గంగారం వద్ద పొలంలో నాట్లు వేస్తున్న రైతులతో మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నారు. వారితో కలిసి నాట్లు వేశారు. 

అనంతరం కూలీలతో భోజనం చేశారు. రైతు భరోసా, రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్ పడుతుందా.. సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. ఉపాధి హామీ రద్దు చేస్తే ఎలా అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంపై కేంద్రం చేస్తున్న కుట్రను పార్లమెంటులో తిప్పికొట్టామన్నారు. భవిష్యత్‌‌‌‌లోనూ ఉపాధి హామీ పథకంలో ఎలాంటి మార్పులు లేకుండా అమలు చేసేలా కేంద్రంపై పోరాడుతామని చెప్పారు.