తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ ప్రజాగాయకుడు అందెశ్రీ అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ గీతాలు,గానం ప్రజల్లో చైతన్యం రగిలించాయని“జయ జయహే తెలంగాణ” రూపంలో ఆయన రచన తెలంగాణ ఆత్మగా నిలిచిపోతుందన్నారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అందెశ్రీ నవంబర్ 10న ఉదయం హైదరాబాద్ లాలాగూడలోని ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు డాక్టర్లు. ప్రజల సందర్శనార్థం ఇవాళ సాయంత్రం వరకు వినోబా నగర్ లోనే అందెశ్రీ మృతదేహం ఉంచనున్నారు. అనంతరం ఘట్కేసర్ లోని NFC నగర్ కు తరలించనున్నారు.నవంబర్ 11న ఉదయం ఘట్ కేసర్ లో అందే శ్రీ అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో1961 జూలై 18 నజన్మించారు అందెశ్రీ..అసలు పేరు అందె ఎల్లయ్య. ఈయన అనాథగా పెరిగారు, ఎలాంటి చదువు చదవకపోయినా, స్వీయకృషితో తెలుగు సాహిత్యంపై పట్టు సాధించి ప్రజాకవిగా ఎదిగారు. బాల్యంలో గొర్రెల కాపరిగా పనిచేశారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు' (ఇది తొలిసారిగా ఆయనకు గుర్తింపు తెచ్చిన పాట).'పల్లెనీకు వందనములమ్మో'.సినీ పాటలు ('గంగ' సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు). మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో, తెలంగాణ ధూంధాం కార్యక్రమ రూపశిల్పిగా కీలక పాత్ర పోషించారు.
