
హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరిగే సరస్వతీ పుష్కరాలకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని పెద్ద పల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. త్రివేణి సంఘంలో పుణ్యస్నానాలకు ఆచరించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా పిలుస్తామన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాలేశ్వరం సరస్వతీ పుష్కర ఏర్పాట్లను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, అధికారులతో కలిసి పరిశీలించారు. మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున పెండింగ్ పనులు త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సరస్వతీ పుష్కరాలకు వస్తారని ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండాఏర్పాట్లు చేయాలన్నారు.
ALSO READ | సరస్వతీ పుష్కరాల్లో ఆఫీసర్లు అలర్ట్ గా ఉండాలి : కలెక్టర్ రాహుల్ శర్మ
మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఏర్పాట్లు పనులు స్పీడ్ గా జరుగుతున్నాయన్నారు. యూపీలో జరిగిన కుంభమేళా తరహాలో ఏర్పాట్లు అదిరిపోవా లన్నారు. పన్నెండు రోజుల పాటు పుష్కరాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతాయన్నారు. తెలంగాణతో ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని, ఈ నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. యూపీలో జరిగే మహాకుంభమేళా కు రావాలని కొందరు సీఎం రేవంత్ రెడ్డిని కోరితే తెలంగాణలోనే అత్యంత వైభవంగా పుష్కరాలు జరుగుతాయని దానికి ప్రధానమంత్రికి ఆహ్వానం పంపుతామని తెలిపారని ఎంపీ వంశీకృష్ణ గుర్తుకు చేశారు.
కుంభమేళా కంటే పది రేట్లు ఎక్కువగా సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తాం. ప్రధాని వచ్చి తప్పకుం డా కాలేశ్వరం వచ్చి సరస్వతి పుష్కరాల్లో త్రివేణి సంఘంలో పుణ్యస్నానాలు ఆచరించాలని కో రుతున్నం. నూతన ఘాట్ పైన 16 అడుగుల ఎత్తయిన సరస్వతి అమ్మవారి రాతి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారు. పుష్కరాలు జరిగే 12 రోజులు నది హారతి నిర్వహించడానికి ఈ సారి హారతి ఫ్లాట్ ఫాం కూడా నిర్మించారు.' అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు.