సరస్వతీ పుష్కరాల్లో ఆఫీసర్లు అలర్ట్ గా ఉండాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

సరస్వతీ పుష్కరాల్లో ఆఫీసర్లు అలర్ట్ గా ఉండాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

మల్హర్, (మహాదేవపూర్), వెలుగు: కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, త్రివేణి సంగమంలో సరస్వతీ పుష్కరాల సమయంలో అఫీసర్లు అలర్ట్​గా ఉండాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం వారు కాళేశ్వరంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

అనంతరం కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 15న ప్రారంభంకానున్న సరస్వతీ నది పుష్కరాలకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారని, ప్రతిరోజు కాశీ పీఠాధిపతులతో నది హారతి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.