
గోదావరిఖని: రామగుండం ప్రాంతానికి ఐదేండ్ల కింద ఈఎస్ఐ హాస్పిటల్ మంజూరైన విషయం తెలిసిందే. కాగా హాస్పిటల్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవ తీసుకుని హాస్పిటల్ నిర్మాణానికి టెండర్లు పిలిచేలా కృషి చేశారని సీనియర్ లీడర్ పి.మల్లికార్జున్ తెలిపారు.
ఇందుకు ఎంపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆయన గురువారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే రాజ్ఠాకూర్కు మల్లికార్జున్ ధన్యవాదాలు తెలిపారు.