పెద్దపల్లి మహిళకు కరీంనగర్ లో అంత్యక్రియలు

పెద్దపల్లి మహిళకు కరీంనగర్ లో అంత్యక్రియలు

కన్న ఊరే దూరమైంది

కరీంనగర్, వెలుగు: కరోనా ఏ క్షణాన వచ్చిందో కానీ.. బంధాలను ఎడబాపుతోంది. పానం పోతే నలుగురూ మోసే దిక్కు లేకుండా పోతోంది. కరోనాతో చనిపోయిన ఓ మహిళ తన సొంతూర్లో అంత్యక్రియలకు సైతం నోచుకోలేదు. పెద్దపల్లి కి చెందిన ఓ మహిళ(65) కరోనాతో బాధపడుతూ 10 రోజుల కిందట కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో చేరింది. శుక్రవారం రాత్రి చనిపోయింది. రాత్రి జోరుగా వర్షం.. దీంతో కుటుంబసభ్యులు మృతదేహాన్ని తీసుకుపోవడానికి సైతం రాలేకపోయారు. కరోనాతో చనిపోయిన డెడ్ బాడీని అందరితోపాటు వార్డులో ఉంచలేరు. దీంతో గతంలో పోలీస్ ఔట్ పోస్టుగా వాడిన గదిలో శవాన్ని ప్యాక్ చేసి ఉంచారు. సిద్దిపేటలో ఉండే కొడుకు కోసం ఉదయం సుమారు 11 గంటల వరకు అధికారులు వేచి చూశారు. ఆ తరవాత సొంతూరుకు తీసుకెళ్లలేమని చెప్పడంతో కరీంనగర్ లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిపించారు. దీనికి ఆరోగ్య సిబ్బందితో పాటు కొడుకు మాత్రమే హాజరయ్యాడు.

For More News..

ఫోన్లు ట్యాప్ చేసుడేంది?

272 కరోనా డెడ్ బాడీలకు అంత్యక్రియలు చేసిన మాజీ ఎమ్మెల్యే

ప్లేయర్ల కోసం చార్టెడ్‌ ఫ్లైట్స్‌.. హోటల్‌ బుకింగ్స్‌!