పనులు చేసేందుకు పైసలు డిమాండ్‌‌‌‌ .. రెడ్‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నాఆఫీసర్లు

పనులు చేసేందుకు పైసలు డిమాండ్‌‌‌‌ .. రెడ్‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నాఆఫీసర్లు
  • బిల్లు మంజూరు చేసేందుకు లంచం తీసుకున్న పెద్దశంకరంపేట ఇన్‌‌‌‌చార్జి ఎంపీడీవో

పెద్దశంకరంపేట/రేగోడ్, వెలుగు : డ్రైనేజీ పనులకు సంబంధించి బిల్లులు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్‌‌‌‌ చేసిన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ఇన్‌‌‌‌చార్జి ఎంపీడీవో విఠల్‌‌‌‌రెడ్డిని ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. 2022– 23 సంవత్సరంలో పెద్దశంకరంపేటలో చేపట్టిన డ్రైనేజీ పనులకు సంబందించి ఎంబీ రికార్డు పూర్తి కాగా రూ. 1.95 లక్షలు మంజూరు అయ్యాయి. దీంతో పనులు చేసిన కాంట్రాక్టర్‌‌‌‌ బిల్లుకు సంబంధించిన చెక్కు ఇవ్వాలని ఇన్‌‌‌‌చార్జి ఎంపీడీవో విఠల్‌‌‌‌రెడ్డిని కలిశాడు. 

చెక్కు ఇచ్చేందుకు రూ.20 వేలు డిమాండ్‌‌‌‌ చేసిన ఎంపీడీవో చివరకు రూ.15 వేలు ఇవ్వాలని చెప్పాడు. దీంతో సదరు కాంట్రాక్టర్‌‌‌‌ ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో శుక్రవారం ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌లో విఠల్‌‌‌‌రెడ్డిని కలిసి డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఎంపీడీవోను రెడ్‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నారు. అరెస్ట్‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.