కాంగ్రెస్ లీడర్ల మాటలు నమ్మొద్దు: పెద్ది సుదర్శన్​రెడ్డి

కాంగ్రెస్ లీడర్ల మాటలు నమ్మొద్దు: పెద్ది సుదర్శన్​రెడ్డి

నర్సంపేట, వెలుగు :  కాంగ్రెస్​ పార్టీ లీడర్ల మాటలు నమ్మొద్దనినర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి ప్రజలకు సూచించారు. నర్సంపేటలోని బీఆర్ఎస్​ పార్టీ ఆఫీస్​లో నర్సంపేట, ఖానాపురం, దుగ్గొండి మండలాలకు చెందిన కాంగ్రెస్​, బీజేపీ పార్టీల కార్యకర్తలు మంగళవారం గులాబీ కండువా కప్పుకున్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణను సీఎం కేసీఆర్​ తొమ్మిదేండ్లలో ఒక విజన్​తో డెవలప్​మెంట్​ చేశారని తెలిపారు. మరోసారి బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో దొమ్మటి సంతోష్​గౌడ్​, శీలం రాంబాబు, దార్ల రమాదేవి, నల్లా మనోహర్​రెడ్డి, నాగెల్లి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.