పీర్జాదిగూడ రీసైక్లింగ్ పార్కు సూపర్.. ప్రాసెసింగ్ విధానంపై సంతృప్తి

పీర్జాదిగూడ రీసైక్లింగ్ పార్కు సూపర్.. ప్రాసెసింగ్ విధానంపై సంతృప్తి
  • ఖమ్మం నగర కమిషనర్ అభిషేక్ అగస్త్యా

మేడిపల్లి, వెలుగు: పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని సమీకృత వ్యర్థ పదార్థాల రీసైక్లింగ్​ పార్కు పనితీరుపై ఖమ్మం నగర కమిషనర్ అభిషేక్ అగస్త్యా సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి అడిషనల్​ కలెక్టర్ రాధిక గుప్తాతో కలిసి ఆయన ఈ పార్కును సందర్శించారు. యంత్రాల పనితీరు, సామర్థ్యం, ఘన వ్యర్థాలను వేరు చేయడం, కంపోస్ట్ యూనిట్, తడి వ్యర్థాలతో బ్రికెట్స్ తయారీ విధానాన్ని పరిశీలించారు. ప్రాసెసింగ్ విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు.